News December 30, 2025
ఏలూరు: న్యూ ఇయర్ లింక్స్‌తో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

నూతన సంవత్సర వేడుకల వేళ సైబర్ మోసగాళ్లు విరుచుకుపడే అవకాశం ఉందని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. గ్రీటింగ్స్, గిఫ్ట్స్, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. ఆ లింకుల ద్వారా మొబైల్‌లోకి మాల్వేర్ ప్రవేశించి, ఓటీపీలు, బ్యాంకు వివరాలను తస్కరించే ప్రమాదముందని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News December 31, 2025
HYDపై పాలమూరు ఘన విజయం

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T-20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 154/8 పరుగులు చేసింది. అనంతరం మహబూబ్ నగర్ జట్టు 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.MBNR జట్టుకు చెందిన క్రీడాకారులు అబ్దుల్ రపే-53* (4s-5,6s-1), డేవిడ్ కృపాల్ రాయ్-103* (4s-11,6s-6) పరుగులు చేశారు.ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు అభినందించారు.
News December 31, 2025
2026లో టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

టీమ్‌ఇండియా 2026 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్, 3 మ్యాచుల ODI సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో T20 వరల్డ్ కప్, జూన్‌లో AFGతో 3 వన్డేలు, 1 టెస్ట్, జులైలో ENGతో 5 T20s, 3 ODIs, AUGలో SLతో రెండు టెస్టులు, సెప్టెంబర్‌లో AFGతో 3 T20s, WIతో 3 వన్డేలు, 5 T20s, ఆక్టోబర్-నవంబర్‌లో NZతో 2 టెస్టులు, 3 వన్డేలు, డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది.
News December 31, 2025
జనవరి 5న జిల్లాలో గ్రామసభలు: కలెక్టర్

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలి కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గ్రామీణ్ పథకంపై పనులపై సమీక్షించారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.


