News February 9, 2025
ఏలూరు పర్యటనలో మంత్రి కందుల

ఏలూరు పర్యటనకు తొలిసారిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయనకు పూల బొకే ఇచ్చి శాలువతో సత్కరించారు. అనంతరం అక్కడ నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు.
Similar News
News December 20, 2025
NZB: నకిలీ నోట్లతో బ్యాంకర్ల అలెర్ట్

వర్ని బ్యాంకులో ఏకంగా రూ.2లక్షలకుపైగా నకిలీ నోట్లు బయట పడడంతో జిల్లా మొత్తం బ్యాంకర్లు అలెర్ట్ అయ్యారు. GP ఎన్నికల్లో నకిలీ నోట్లు పంపిణీ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిట్ చేసేందుకు డబ్బు ఎవరు తెచ్చినా బ్యాంకు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి వరకూ ఒకటి రెండు దొంగ నోట్లు అనే పరిస్థితి నుంచి అన్ని నోట్లు పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News December 20, 2025
KMR: అడవిలో ఏముంది సోదరా!

అధునాతన భారతావని మించి అడవిలో ఏముంది సోదరా.. జనజీవన స్రవంతిని మించి స్వతంత్రమేమి లేదురా. KMR జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి @ సంతోష్ నిన్న HYDలో DGP సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. తన జీవితంలో విలువైన 25 ఏళ్ల సమయాన్ని వృథా చేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు ఇంతకాలం ఎదురు చూసి తపించిపోయారు. అతని రాకకు కుటుంబసభ్యులు, గ్రామస్థులు వేచిచూస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News December 20, 2025
ICMRలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ICMRలో 28 సైంటిస్ట్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/


