News September 4, 2025
ఏలూరు పాము కాటుకు గురై యువకుడి మృతి

ద్వారక తిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన అశోక్ (23) పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అశోక్ పొలం పనులు చేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. బుధవారం పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. బంధువులు అతన్ని భీమడోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News September 4, 2025
ప్రకాశం: పల్లెలో ఎన్నికల నగారా.. అంతా సిద్ధమేనా!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పల్లె రాజకీయం జోరందుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం మూడు నెలల ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో జనవరిలోనే ‘పల్లె పోరు’ జరిగే ఛాన్సుంది. జిల్లాలో మొత్తం 730 గ్రామ పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఉన్నాయి. 56 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీలు, ఒంగోలు, కనిగిరి, పొదిలి, దర్శి, మార్కాపురం, అద్దంకి, చీరాల, కందుకూరు తదితర పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
News September 4, 2025
HYDలో నిమజ్జన ఏర్పాట్లకు ALL SET!

నగరంలో ఈనెల 6వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 30 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. 13 కంట్రోల్ రూమ్‌లు, నిమజ్జనానికి 20 ప్రధాన చెరువులు, కృత్రిమ కొలనులు 72, స్థిర క్రేన్లు 134, 259 మొబైల్ క్రేన్లు, తాత్కాలిక విద్యుత్ దీపాలు 56,187, హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 20మంది గజఈతగాళ్లు, శానిటేషన్ సిబ్బంది 14,486 ఉండనున్నారు.
News September 4, 2025
HYD: 6 జోన్లలో 1,04,135 విగ్రహాల నిమజ్జనం

జీహెచ్ఎంసీలోని 6 జోన్ల పరిధిలో మంగళవారం వరకు 1,04,135 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పెద్ద చెరువులతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనాలు జరిగాయని, వీటిలో చిన్న విగ్రహాలతో పాటు పెద్ద విగ్రహాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.