News February 17, 2025
ఏలూరు: పీసీఆర్ఏస్ రద్దు.. కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కలికంగా రద్దు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లాలోని అన్ని డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో పిజిఆర్ఏస్ రద్దు చేసున్నట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News January 11, 2026
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్(<
News January 11, 2026
చర్మానికి స్క్రబ్ ఎందుకు చెయ్యాలంటే?

పని ఒత్తిడిలో పడి చాలామంది చర్మ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో మృతకణాలు చేరి చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి అంటే వీపు, మెడ, కాళ్లకు స్క్రబ్బింగ్ చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. దీనికోసం బాత్‌సాల్ట్, డీప్ క్లెన్సింగ్ మిల్క్ వాడొచ్చు. లేదంటే గులాబీరేకల ముద్దలో తేనె, పాలు, ఉలవపిండి కలిపి చర్మానికి పట్టించి స్క్రబ్ చెయ్యాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.
News January 11, 2026
ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి

TG: ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.


