News October 30, 2025

ఏలూరు: పోలీస్ ఓపెన్ హౌస్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

ఏలూరులోఎస్పీ కార్యాలయ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీస్ హౌస్ ప్రారంభించామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. పోలీసులు నిర్వహించే విధులు, వారు వినియోగించే ఆయుధాలు, వాహనాల వివరాలు, విద్యార్థి స్థాయి నుంచే తెలియజేయడం ద్వారా పోలీసు విధులు విద్యార్థులకు అవగతం అవుతాయన్నారు. పోలీసు జాగిలాలను కేసు విచారణలో ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయన వివరించారు.

Similar News

News October 30, 2025

కార్తీక దీపాలంకరణలో ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం

image

కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన స్వయంభు శ్రీ ఎల్లమ్మ అమ్మవారు కార్తీక గురువారం సాయంత్రం సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయంలో చేసిన దీపాలంకరణతో భక్తి వాతావరణం అలముకుంది. ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు.

News October 30, 2025

ఆ విద్యార్థుల అకౌంట్లలో నగదు జమ: అడ్లూరి

image

TG: ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ స్కీం కింద ఒక్కో విద్యార్థికి ₹20 లక్షల చొప్పున 2,288 మందికి ₹304 కోట్లు <<18143119>>విడుదల<<>> చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 2022 నుంచి ఇప్పటివరకు ₹463 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర విద్యార్థులకు ఉపశమనం లభిస్తుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు.

News October 30, 2025

తంగళ్లపల్లి: టార్పాలిన్ కవర్లు తప్పనిసరి: కలెక్టర్ ఆదేశం

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్ కవర్లు అందజేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం ఆమె తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు. రైతుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.