News February 3, 2025

ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు..ఎస్పీ

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు ఇవ్వడానికి ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.

Similar News

News February 16, 2026

HYD: అదిరిందిగా.. కొత్త కమిషనరేట్

image

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముస్తాబవుతోంది. మేడిపల్లిలోని 56 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న పనులు తుదిదశకు చేరుకున్నాయి. అత్యాధునిక వసతులతో రణగొణధ్వనులకు దూరంగా, రాజసం ఉట్టిపడేలా రూపుదిద్దుకుంటోంది. ప్రజా భద్రత, పరిపాలనా సమర్థతను మరింత బలోపేతం చేసేలా నిర్మితమవుతున్న ఈ కార్యాలయం, పోలీసు వ్యవస్థకు కీలక కేంద్రంగా మారనుంది. రాష్ట్ర సచివాలయాన్ని తలపిస్తూ కనువిందు చేస్తోంది.

News February 16, 2026

HYD: WOW.. అదిరిందిగా.. కొత్త కమిషనరేట్

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: సూర్యాపేట కలెక్టర్

image

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం స్థానిక జూనియర్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈనెల 20 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో సూర్యాపేట విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.