News February 20, 2025
ఏలూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష

బాలిక గర్భణి కావడానికి కారణమైన వ్యక్తికి జైలుశిక్ష పడింది. గణపవరం మండలం పిప్పరకు చెందిన దొంగ చిన్నబ్రహ్మయ్య 2014లో పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను గర్భవతిని చేసి దుబాయ్ పారిపోయాడు. తర్వాత బాలికకు పుట్టిన బిడ్డ చనిపోయింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఏలూరు జిల్లా పోక్సో కోర్టు స్టేషన్ జడ్జి సునంద తీర్పు చెప్పారు.
Similar News
News February 21, 2025
మొగల్తూరు : పేరుపాలెం బీచ్ సమీపంలో వ్యక్తి సూసైడ్

పేరుపాలెం బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపిన వివరాలు.. రిసార్ట్ సమీపంలోని సీఆర్ జెడ్ పరిధిలోని తోటలో గుళికలు తిని మృతిచెందాడు. అయితే అతని జేబులో ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఉందని , ఫోన్ లాక్ ఓపెన్ కాలేదని వీఆర్వో దుర్గారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడిది కృష్ణా జిల్లా కృతివెన్నుగా అనుమానిస్తున్నారు.
News February 21, 2025
భీమడోలు: కుళ్లిన ఎగ్ పఫ్ విక్రయాలు

భీమడోలు జంక్షన్‌లోని ఓ బేకరీలో గురువారం రాత్రి కుళ్లిన ఎగ్ పఫ్‌లను విక్రయించడం వివాదాస్పదమైంది. భీమడోలు మండలం పెదలింగంపాడు గ్రామానికి చెందిన పులిపాటి రాజు అనే వ్యక్తి ఎగ్ పఫ్‌లను కొని ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లలు వాటిని తినే సమయంలో దుర్వాసన రావడంతో ఊసేశారు. దీంతో రాజు బేకరీ వద్దకు వెళ్లి, వ్యాపారిని నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రాజు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
News February 21, 2025
పా.గో: గవర్నర్‌కు మాజీ మంత్రుల వినతులు

వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైయస్ జగన్‌కి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.