News October 5, 2024

ఏలూరు: భర్తతో గొడవపడి పుట్టింటికి.. ఆపై చనిపోవాలని విజయవాడకు.!

image

ఏలూరు మండలం పోణంగికి చెందిన అఖిల తన భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో శుక్రవారం చనిపోవాలని 3నెలల బిడ్డతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక గంటలోనే ఆమె విజయవాడలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అక్కడ నుంచి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News March 2, 2026

యథావిధిగా జిల్లాలో పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి

image

భీమవరంలోని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టరు నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.

News March 1, 2026

గొల్లలకోడేరు కాదు.. వన్‌టౌన్ స్టేషన్‌కు రండి: SP

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలు, ఫిర్యాదులతో నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.

News March 1, 2026

ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

image

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్‌కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్‌కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.