News March 14, 2025

ఏలూరు : భార్యతో గొడవపడి భర్త సూసైడ్

image

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో గురువారం జరిగింది. పవర్ పేట పిల్లా వారి వీధికి చెందిన సుశీల్ (42) బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఉదయం లేచేసరికి ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారమందుకున్న టూటౌన్ సీఐ వైవీ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News March 14, 2025

BREAKING: మసీదులో బాంబు బ్లాస్ట్

image

దాయాది పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. సౌత్ వజీరిస్థాన్‌లోని అజామ్ వర్సాక్‌లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతుండగా ఓ మసీదులో బాంబు పేలింది. ఈ ఘటనలో JUI డిస్ట్రిక్ట్ చీఫ్ అబ్దుల్లా నదీమ్, మరొకరు గాయపడ్డారని సమాచారం. బాంబు పెట్టిందెవరు? ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సి ఉంది. రంజాన్ మాసం రెండో శుక్రవారం కావడంతో ప్రజలు భారీగా మసీదుకు వచ్చారని సమాచారం.

News March 14, 2025

నటన వదిలేద్దామనుకున్నా.. నాన్న ఆపారు: అభిషేక్ బచ్చన్

image

దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్ కెరీర్ తొలినాళ్లలో వరసగా 12కు పైగా ఫ్లాపుల్ని చవిచూశారు. ఆ సమయంలో సినిమాల్ని వదిలేయాలని తాను భావించినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘ఓరోజు నాన్నతో నా బాధ చెప్పాను. ఈ రంగం వదిలేస్తానన్నాను. కానీ నాన్న నన్ను వారించారు. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని, పోరాటం ఆపొద్దని చెప్పి నాలో స్ఫూర్తి నింపారు’ అని వెల్లడించారు.

News March 14, 2025

NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.

error: Content is protected !!