News August 9, 2024

ఏలూరు: భార్యను హతమార్చిన భర్త అరెస్ట్

image

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో మహిళ హత్యకు సంబంధించి ఆమె భర్త సూర్యచంద్రంను అరెస్టు చేసినట్లు ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ శుక్రవారం తెలిపారు. ఈనెల 7న రామానుజపురంలో రాజనాల సాయిలక్ష్మిని ఆమె భర్త సూర్యచంద్రం హత్య చేశాడన్నారు. భార్య వేధింపులు, గొడవల వల్ల హత్య చేసినట్లు సూర్యచంద్రం ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు.

Similar News

News November 7, 2025

ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

image

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.

News November 7, 2025

నరసాపురం వరకు పొడిగించిన వందే భారత్ రైలు

image

కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు అందాయి. దీంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 7, 2025

మత్తు పదార్థాల నివారణపై గట్టి నిఘా ఉంచాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఇన్‌ఛార్జ్ జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధికారి ఆర్.వి. ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం ఉండరాదని, దీనిపై క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.