News June 15, 2024
ఏలూరు: మసీదుల వద్ద కట్టదిట్టమైన బందోబస్తు: SP

ఏలూరు ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎస్పీ మేరీ ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. మతపెద్దలతో సమావేశమై మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. పోలీసు అధికారులు ముస్లిం పెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 25, 2026
నరసాపురం: వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

నరసాపురం మండలం వేములదీవి పడమరలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు(53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నరసాపురం తహశీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్‌ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News February 25, 2026
పాలకొల్లు: మేకా శేషుబాబుపై సస్పెన్షన్ ఎత్తివేత

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్‌ను వైసీపీ అధిష్ఠానం ఎత్తివేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం రాత్రి ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన శేషుబాబు, త్వరలోనే రీఎంట్రీ ఇస్తారనే ప్రచారానికి ఈ నిర్ణయంతో బలం చేకూరింది. పార్టీ ప్రకటనతో ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 25, 2026
ప.గో: నిరుద్యోగ యువతకు GOOD NEWS

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు.


