News March 18, 2025

ఏలూరు: మహిళపై అత్యాచారం

image

తనకు న్యాయం చేయాలని అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయింది.

Similar News

News December 31, 2025

ఆసిఫాబాద్ ఎక్సైజ్ అధికారుల సూచన

image

డిసెంబర్ 31 సంబరాల్లో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈవెంట్స్ నిర్వహించే వారు ఎక్సైజ్ శాఖ అనుమతి పత్రం పొందాలని, అనుమతి లేని చోట మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు వివరించారు.

News December 31, 2025

సంగారెడ్డి: కొత్త సంవత్సరం వేళ లింక్స్ ఓపెన్ చేయొద్దు

image

కొత్త సంవత్సరం పురస్కరించుకొని అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలర్ ఫల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కి ఫోన్ చేయాలన్నారు.

News December 31, 2025

మార్టిన్‌కి సోకిన మెనింజైటిస్ వ్యాధి ఇదే!

image

AUS మాజీ క్రికెటర్ డామీన్ <<18720461>>మార్టిన్<<>> మెనింజైటిస్ వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడు- వెన్నెముకను కప్పి ఉంచే రక్షణ పొరలకు సోకే ప్రమాదకరమైన ఇన్ఫెక్షనే మెనింజైటిస్. ఇది మెదడును దెబ్బతీస్తుంది. వ్యాధి సోకినవారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.