News January 29, 2025
ఏలూరు: మార్కెట్ కమిటీ చైర్మన్‌ల రిజర్వేషన్లు: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని మార్కెట్ కమిటీ చైర్మన్‌లకు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఖరారు చేశారు. ఇందులో భీమడోలు, ఉంగుటూరు, కైకలూరు బీసీ మహిళలు, దెందులూరు ఓసి మహిళ, చింతలపూడి కలిదిండి, ఏలూరు ఓసీ జనరల్, నూజివీడు ఎస్సీ జనరల్, పోలవరం ఎస్టీలకు నిర్ణయించినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుకూలంగా అభ్యర్థులను నిర్ణయించుకోవాలని తెలిపారు.
Similar News
News September 18, 2025
ఈ నెల 30 వరకు అసెంబ్లీ

AP: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 30 వరకు (10 రోజులు) నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సభలో చర్చించేందుకు టీడీపీ 18 అంశాలను ప్రతిపాదించింది. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉండనున్నాయి. మరోవైపు శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.
News September 18, 2025
HYD: డబ్బు ఊరికే రాదుగా.. జాగ్రత్తలు చెప్పండి!

ఇంట్లోని వృద్ధుల స్మార్ట్ ఫోన్లను గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర లేకపోతే జాగ్రత్తలు చెబుతూ ఉండండి. ఇటీవల సైబర్ నేరస్థులు వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల బషీర్‌బాగ్‌లో ఓ రిటైర్డ్ లేడీ అధికారి సైబర్ నేరస్థుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందారు. అందుకే అన్‌వాంటెడ్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తొద్దని, పలు జాగ్రత్తలు చెప్పండి.
News September 18, 2025
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. సిలబస్ భారం తగ్గింపు !

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొండలా ఉన్న సిలబస్ తగ్గించనుంది. గత 5ఏళ్లుగా నీట్, జేఈఈ, ఎప్సెట్ తదితర ప్రశ్నాపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏఏ భాగం నుంచి ప్రశ్నలు రాలేదో గమనించి ఆ సిలబస్‌ను తొలగించనున్నారు. అయితే ఈ మార్పులు వచ్చే విద్య సంవత్సరం (2026-27)నుంచి అమలు చేయాలని ఆలోచిస్తోందని సమాచారం. ఇదే జరిగితే ఇక స్టూడెంట్స్ హ్యపీయే కదా!