News December 12, 2025

ఏలూరు మీదుగా రైళ్ల పెంపు

image

ఏలూరు జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను పెంచుతూ ద.మ రైల్వే ఉత్తర్వులు ఇచ్చింది. సికింద్రాబాద్ – అనకాపల్లి( 07059) ఈనెల 29 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 వరకూ నడుస్తుంది. అనకాపల్లి – సికింద్రాబాద్ (07060) ఈ నెల 30 – ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. (07035) చర్లపల్లి- అనకాపల్లి JAN 17- FEB 14 వరకు నడుస్తుంది. అనకాపల్లి – చర్లపల్లి (07036) JAN 18- FEB 15 వరకూ పొడిగించారు.

Similar News

News December 13, 2025

KMR: 16 ప్రదేశాల్లో ఆరెంజ్, 16 ఎల్లో అలర్ట్

image

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత స్థిరంగా ఉంది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా 16 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 10°Cలోపు ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా 16 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. 15°C లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్రదేశాలు చలి గుప్పిట్లో బందిలయ్యి ఉన్నాయి. ప్రజలు తమ పనులకు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

News December 13, 2025

అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

image

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.

News December 13, 2025

చిన్నకాపర్తిలో బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదు: కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డ్రైనేజీలో ఓట్లు దొరికిన ఘటనపై ఎలాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లు బయటపడగానే ఆర్డీఓ అశోక్ రెడ్డిని పంపి విచారణ జరిపించామన్నారు. పోలైన ఓట్లు, కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లు, డ్రైనేజీలో దొరికిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయని కలెక్టర్ తెలిపారు.