News February 9, 2026

ఏలూరు: ‘మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టారు’

image

‘మీసాలపై నిమ్మకాయలు నిలబెడతాం’ అనే నానుడిని జీలకర్రగూడేనికి చెందిన బాహుబలేంద్రుని బాలవర్ధిరాజు అక్షరాలా నిజం చేసి చూపించారు. సినీ నటుడైన ఆయన, వృత్తిరీత్యా పొడవాటి మీసాలు పెంచడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. భారీ మీసాలను మెలితిప్పి, వాటిపై నిమ్మకాయలను నిలబెట్టి చూపిస్తున్న ఆయన విన్యాసం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1958లో శివాజీ గణేశన్ నటించిన ‘వీరప్రతాప 1940’ సహా పలు చిత్రాల్లో నటించారు.

Similar News

News February 15, 2026

శివాలయాల్లో MP పార్థసారథి పూజలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూపురం ఎంపీ BK పార్థసారథి పెనుగొండలోని పలు శివాలయాలను దర్శించుకున్నారు. పట్టణంలోని ముక్తేశ్వరాలయం, నాగేశ్వరాలయం, కాశీ విశ్వేశ్వర ఆలయాలతో పాటు భోగసముద్రంలోని యోగేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సాయి కళ్యాణ్, శశిభూషణ్ పటేల్, గాడి మల్లికార్జున యాదవ్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.

News February 15, 2026

కరీంనగర్: రేపు ప్రజావాణి రద్దు

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నట్లు పేర్కొన్నారు. అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని సోమవారం నిర్వహించలేమని చెప్పారు.

News February 15, 2026

ఛాంపియన్‌గా కర్నూలు జిల్లా జట్టు

image

రెండు రోజులుగా కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరుగుతున్న 3వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కర్నూలు జట్టు మొదటి స్థానం, కృష్ణాజిల్లా జట్టు రెండవ స్థానం, గుంటూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది.