News March 26, 2025

ఏలూరు: ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

సచివాలయంలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా సమస్యలపై సీఎంతో చర్చించారు.

Similar News

News November 1, 2025

సిటీ ఆర్టీసీ బస్సులో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలు

image

కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో నగరంలోని సిటీ బస్సుల్లో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రోడీలక్స్ బస్సులలో ఫైర్ ఎగ్జిటింగిషర్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వీటిని ఉపయోగించి మంటలను ఆర్పవచ్చు.

News November 1, 2025

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు

image

AP: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమాయకులు చనిపోయారని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటివి జరుగుతున్నాయని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

News November 1, 2025

వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.