News March 26, 2025
ఏలూరు : ముళ్ల పొదల్లో పసికందు.. మృతి

తూ.గో జిల్లాలో పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.
Similar News
News February 11, 2026
కామారెడ్డి: ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు వేసేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.
News February 10, 2026
అనంతపురంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

అనంతపురంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోడ్ లో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, దీక్ష హోమం దశ హారతులు, అనంతరం శేష వాహనంపై నటరాజ అలంకారంలో శ్రీ కాశీ విశ్వేశ్వరున్ని ఊరేగింపు నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు నిర్వహించారు.
News February 10, 2026
T20WC: USAపై పాక్ విజయం

అమెరికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 32 రన్స్ తేడాతో గెలిచింది. 191 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన USA 158/8 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో రంజనే 51, షయాన్ 49, మిలింద్ 29 రన్స్ మినహా ఎవరూ రాణించలేదు. పాక్ బౌలర్లలో తారిఖ్ 3, షాదాబ్ 2 వికెట్లు తీశారు. టోర్నీలో పాక్‌కు ఇది రెండో విజయం కాగా USAకు రెండో ఓటమి.


