News December 24, 2025
ఏలూరు: యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు

మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలెపు వెంకన్న(41), గృహలక్ష్మి(37)లు కంకిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెలను చూడటానికి బైక్‌పై ఈ నెల 21న వెళ్తుండగా కారు ఢీకొంది. వెంకన్న అక్కడికక్కడే చనిపోగా.. చికిత్స పొందతూ గృహలక్ష్మి నిన్న కన్నుమూసింది. దీంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
Similar News
News December 25, 2025
కొబ్బరి తోటలకు ‘తెల్లదోమ’ ముప్పు: సాజా నాయక్

జిల్లాలో 13,650 హెక్టార్లలో విస్తరించిన కొబ్బరి తోటలపై రాబోయే మూడు నెలల్లో తెల్లదోమ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్ హెచ్చరించారు. దీని నివారణకు పవర్ స్ప్రేయర్‌తో నీళ్లు, వేపనూనె, ఈసారియా ఫ్యూమోసోరోజియా పిచికారీ చేయాలని సూచించారు. పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు, మిత్రకీటకాలను సంరక్షించుకోవడం ద్వారా తెల్లదోమను అరికట్టవచ్చని గురువారం తెలిపారు.
News December 25, 2025
చైనా మాంజా వాడితే జైలుకే: సీపీ హెచ్చరిక

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేందుకు ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇలాంటి మాంజాతో పక్షులతో పాటు ప్రాణికోటికి, వాహనదారులకు తీవ్ర ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, యువత పర్యావరణహితమైన దారాలను మాత్రమే వాడాలని, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ సూచించారు.
News December 25, 2025
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్‌బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్‌ను కొట్టి చంపారు. బుధవారం రాత్రి 11 గం.కు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈ హింసకు తెగబడ్డారు. కాగా ఇటీవల <<18624742>>దీపూ చంద్రదాస్<<>> అనే హిందూ యువకుడిని కొందరు కొట్టి చంపి, తగలబెట్టిన విషయం తెలిసిందే.


