News August 8, 2025
ఏలూరు: యాసిడ్ మీద పడి మహిళ మృతి

ఏలూరు జాతీయ రహదారిపై తాళ్లమూడి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ఆటో బోల్తా పడి, ఆ యాసిడ్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై పడింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 8, 2025
నెల్లూరులో డిజైన్స్ బట్టి అదిరిపోయే రేట్లు

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా భావించే రాఖీ పండగ సందడి నెల్లూరులో మొదలైంది. ఎటు చూసినా అందమైన డిజైన్ల రాఖీలే దర్శనమిస్తున్నాయి. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు మహిళలు దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో నెల్లూరులోని పలు దుకాణదారులు రాఖీల రేట్లు అమాంతం పెంచేశారు. రూ.30 నుంచి రూ.500 వరకు రాఖీల రేట్లు ఉన్నాయి. వెండి రాఖీలు సైతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి.
News August 8, 2025
HYD: TG CPGET.. 7,518 మంది హాజరు

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం 44 సబ్జెక్టులకు రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్షలు (TG CPGET) కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ 3 సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం 5 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8,587 మంది అభ్యర్థులకు గాను.. 7,518 (87.55%) మంది హాజరైనట్లు ఉస్మానియా యూనివర్సిటీ TG CPGET డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు.
News August 8, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల తక్షణ సాయం!

రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స గరిష్ఠంగా 7 రోజుల వరకు వర్తిస్తుంది. మోటార్ వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా ఈ పథకానికి అర్హులే. SHARE IT