News March 5, 2025

ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం

image

సాధారణంగా రాజకీయాల్లో కానీ ఆటల్లో కానీ పోటీల్లో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ రంగంలో అయినా ప్రత్యర్థులు అంటే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. అయితే ఎమ్మెల్సీగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ దిడ్ల వీర రాఘవులు వీరిద్దరూ పోటీపడ్డారు. అంతేకాక కౌంటింగ్‌లో కూడా వీరిద్దరి మధ్యనే పోటీ నెలకొంది. అయితే రాజశేఖర్ గెలిచాక స్నేహపూర్వక వాతావరణంలో కౌంటింగ్ సెంటరులో ఇరువురూ ఆత్మీయంగా నవ్వుతూ పలకరించుకున్నారు.

Similar News

News March 6, 2025

పెదపాడు: సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై లైంగిక దాడి

image

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తె(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పెదపాడు మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శారద సతీశ్ వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయి ఇద్దరు కుమార్తెలతో ఉంటున్న మహిళ నాని అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన పెద్ద కుమార్తెపై ఇటీవల నాని లైంగిక దాడికి పాల్పడ్డాడన్న మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News March 6, 2025

భయం లేకుండా చికెన్ తినండి: కలెక్టర్

image

ప.గో జిల్లా ప్రజలు ఎలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం తణుకులో నిర్వహించిన చికెన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. దాదాపు 10 వేల మందికి ఉచితంగా అందిచారు. ఫౌల్ట్రీ రైతులను రుణాల రీషెడ్యూల్‌కు ప్రయత్నిస్తామని కలెక్టర్, MLA రాధాకృష్ణ తెలిపారు. వేల్పూరు కృష్ణానందం కోళ్లఫారం, పెదతాడేపల్లిలో రామలక్ష్మి ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లా మొత్తం చికెన్ తినొచ్చన్నారు.

News March 6, 2025

సిద్ధాంతం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సిద్ధాంతం అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధాంతం చెరువుపేటకు చెందిన పమ్మి చినబాబు (30)మృతి చెందాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టాడంతో తలకు బలమైన గాయం అవ్వగా ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

error: Content is protected !!