News July 3, 2024
ఏలూరు: రెండేళ్ల తర్వాత దొరికిన బాలుడు

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడి ఆచూకీ రెండేళ్ల తర్వాత తెలిసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్లగూడెంకు చెందిన మహాలక్ష్మి కుమారుడు నందకిశోర్ చదవడం ఇష్టంలేక 2022లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గతంలోనూ అలానే వెళ్లి తిరిగి వచ్చేసేవాడు. కానీ.. రెండేళ్ల కింద వెళ్లిన నందకిశోర్ తిరిగి రాలేదు. అతడు కోల్కతాలో ఉన్నట్లు 4 రోజుల కింద తెలియగా.. తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News September 15, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని కార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
News September 14, 2025
వరి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి: జేసీ

వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కడియద్దలో పర్యటించి, వరి కోతలను పరిశీలించారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో మాట్లాడి పంట ధర గురించి ఆరా తీశారు. అంతకుముందు ఉల్లిపాయల మార్కెట్లో ఉల్లి ధరలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొన్నారు.
News September 13, 2025
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.