News November 6, 2025
ఏలూరు: ‘రెండో శనివారం సెలవు లేదు’

మొంథా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజుకు బదులుగా నవంబర్ 8, డిసెంబర్ 13, ఫిబ్రవరి 14 తేదీల రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేయాలని జిల్లా విద్యా అధికారి వెంకటలక్ష్మమ్మ ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా ఈ రోజుల్లో నిర్వహించాలన్నారు.
Similar News
News November 6, 2025
మేడారం జాతరలో 30 వైద్య శిబిరాలు: డీఎంహెచ్వో

జనవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు డీఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు తెలిపారు. ఉప వైద్యాధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లతో కలిసి మేడారంలో పర్యటించారు. శిబిరాల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలను పరిశీలించారు. వైద్య సేవలకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సిబ్బందిని నియమించుకుంటామన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.
News November 6, 2025
‘తొలిప్రేమ’ ఓ ట్రైనింగ్ సెషన్: అధ్యయనం

ఫస్ట్ లవ్ కొందరికి మధుర కావ్యం. మరికొందరికి తీరని వ్యథ. ఏదేమైనా దీనికి ముగింపు ఉండదని, ఇది జీవిత పాఠాలను నేర్పించడానికేనని ఓ అధ్యయనంలో తేలింది. మొదటి ప్రేమ గమ్యం కాదని, ఇది కేవలం భావోద్వేగాలు, అంచనాలు & హార్ట్ బ్రేకింగ్ అనుభవాన్ని పరిచయం చేసేదని నిపుణులు పేర్కొన్నారు. దీనిని ‘ట్రైనింగ్ సెషన్’గా వారు అభివర్ణించారు. ఈ అనుభవంతోనే భవిష్యత్తులో వచ్చే సంబంధాలకు సిద్ధమవుతారని అధ్యయనం చెబుతోంది.
News November 6, 2025
ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.


