News October 21, 2024

ఏలూరు: రైతుల కోసం కంట్రోల్ రూం

image

ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయమై రైతులకు తగిన సలహాలు, సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ ధాత్రి రెడ్డి వెల్లడించారు. రైతులకు ఎటువంటి సమాచారం కావాలన్నా 08812-230448, 7702003584 నంబర్లను సంప్రదించాలని కోరారు. అలాగే టోల్ ఫ్రీ 18004256453కు సైతం కాల్ చేయవచ్చన్నారు. క్వింటాకి కామన్ రకం రూ.2300, గ్రేడ్-ఏ రకానికి రూ.2320 కనీస ధరగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

Similar News

News October 21, 2024

ప.గో: ముగిసిన పల్లె పండగ వారోత్సవాలు

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్లె పండగ వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆయా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 2,523 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ₹.173.87 కోట్లు మంజూరు చేశారు.

News October 21, 2024

ఏలూరు: CM ఫొటో మార్ఫింగ్.. ఒకరిపై కేసు

image

సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యంగా మార్చిన ఓ వ్యక్తిపై ఏలూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. లింగపాలెం మండలం బోగోలుకు చెందిన సాతునూరు లక్ష్మీనవదీప్ సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యకరంగా మార్చాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే విషయమై కె.యోహాన్ అనే వ్యక్తి లక్ష్మీనవదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లింగపాలెం ఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేశారు.

News October 21, 2024

చింతమనేనికి బెదిరింపు.. బోరుగడ్డపై కేసు

image

వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఏలూరులోనూ కేసు నమోదైంది. దెందలూరు MLA చింతమనేని ప్రభాకర్‌కు 2023లో బోరుగడ్డ ఫోన్ చేశారు. ‘మా పార్టీ తలచుకుంటే నీ అంతు చూస్తుంది. మీ సామాజికవర్గాన్ని ఖతం చేస్తాం’ అని బెదిరించారు. ఈక్రమంలో చింతమనేని ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిన్న రాత్రి కేసు నమోదు చేశారు.