News April 15, 2025
ఏలూరు: రైలు కిందపడి ఒకరు మృతి

గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిమెంటు రంగు చొక్కా, నీలం రంగు షాట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. SI సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 22, 2026
10 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు

TG: రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడు విడతల్లో రూ.1,034.42 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన రూ.2 వేల కోట్ల బకాయిలు రావాలంటే పాత నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు (UCs) సమర్పించాలని కేంద్రం పేర్కొంది.
News February 22, 2026
అనకాపల్లి: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. జిల్లాలో 34 కేంద్రాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరానికి చెందిన 26,301 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతి సదుపాయాలు కల్పించామన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
News February 22, 2026
నేడు గుంటూరుకు CMచంద్రబాబు రాక

గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సొసైటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అతిథులు తపాలా సేవా మూర్తులకు సన్మానం చేయనున్నారు.


