News March 1, 2025

ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.

Similar News

News November 3, 2025

వేగం వద్దు బ్రదర్.. DRIVE SAFE

image

వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించదు. ఈ సమయంలో అతివేగం అత్యంత ప్రమాదకరం. ‘కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు.. మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడమే ముఖ్యం’ అని వారు సూచిస్తున్నారు. డ్రైవర్లు నిర్ణీత వేగ పరిమితి పాటించాలని, సురక్షిత దూరాన్ని కొనసాగించాలని అవగాహన కల్పిస్తున్నారు.

News November 3, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్బ్రాంతి

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ గేటు వద్ద ఆర్టీసి బస్సు ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కంకర లోడ్‌తో ఉన్న టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారన్నారు.

News November 3, 2025

పల్నాడులో అమరావతి ORR భూసేకరణకు నోటిఫికేషన్

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో పల్నాడు జిల్లాకు సంబంధించి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 478.38 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. అమరావతి తాలూకాలోని లింగాపురం, ధరణికోట గ్రామాల్లో భూమిని సేకరిస్తారు. పెదకూరపాడు తాలూకాలోని ముస్సపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభం పాడు, తల్లూరు, లింగంగుంట్ల, బలుసుపాడు గ్రామాల్లో భూసేకరణ జరగనుంది.