News March 7, 2025
ఏలూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఏలూరు నిమ్మకాయల యాడ్ సమీప రైల్వేగేట్ వద్ద శుక్రవారం ఓ వ్యక్తి రైలు పట్టాలను దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సైమన్ మాట్లాడుతూ.. మృతుడు కాకర్ల నాగార్జున (28)గా గుర్తించామన్నారు. మృతుడు కోమడవోలు పంచాయతీగా నిర్ధారించామన్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.
Similar News
News March 2, 2026
నెల్లూరు: ఒక్క రోజులోనే రూ.వెయ్యి తగ్గింపు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి కాలం కావడంతో జనవరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరగడంతో ధరల్లో ఊపు వచ్చింది. ఒక్కో బస్తాను రూ.7వేల వరకు విక్రయించారు. హోలీ కారణంగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని మార్కెట్లకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దీంతో నిమ్మ బస్తా ధర ఒక్కరోజులోనే రూ.వెయ్యి పడిపోయింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.5500 వరకు విక్రయిస్తున్నారు.
News March 2, 2026
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్, ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News March 2, 2026
మదనపల్లెలో అధికారుల సస్పెండ్

మదనపల్లె, నిమ్మనపల్లె సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరులో గోల్‌మాల్ జరిగింది. బంగారు రుణాల మంజూరులో నిమనపల్లె సహకార బ్యాంక్ త్రిమెన్ కమిటీ సీఈవోలు హరినాథ రెడ్డి, కరుణాకర రెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్లు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. దీంతో సీఈవోలను ఆ బ్యాంక్ జిల్లా కమిటీ సస్పెండ్ చేసింది. మదనపల్లె సహకార బ్యాంకు ఆఫీసియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్ రఘునాథరెడ్డి సైతం సస్పెండ్ అయ్యారు.


