News October 20, 2025

ఏలూరు: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

ఏలూరులో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వట్లూరు సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతిదేహం పడి ఉండడంతో స్థానికులు జీఆర్పీలకు సమచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టానికి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. రైల్వే HC శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 20, 2025

గుంజేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

ముదిగుబ్బ మండలం గుంజేపల్లి చెరువుకట్ట సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన శేషు, కృష్ణ బైకుపై స్వగ్రామానికి వెళ్తూ జేసీబీని ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న 108 వాహనం అక్కడికి వెళ్లగా.. అప్పటికే వారు మృతి చెందారు. ముదిగుబ్బ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ శివరాముడు తెలిపారు.

News October 20, 2025

తిరుపతి రైల్వే స్టేషన్‌లో నకిలీ టీటీ.!

image

తిరుపతి రైల్వే స్టేషన్‌లో టికెట్ పరిశీలకుడిగా నటిస్తూ టికెట్‌ లేని ప్రయాణికులను మోసంచేసి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రైల్వే భద్రతాదళం, GRP పోలీసులు సంయుక్తంగా కలిసి పట్టుకున్నారు. రైల్వే సిబ్బంది గేట్ నంబర్ 3 వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం చేసుకోవడం గమనించారు. చెకింగ్ ఇన్స్పెక్టర్ అనిచెప్పి రూ.1000 అడుగుతుండగా నకిలీ వ్యక్తిని వారు పట్టుకున్నారు.

News October 20, 2025

జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

image

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రేపు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘స్మృతి పరేడ్‌’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రజలు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, అమరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.