News April 8, 2025

ఏలూరు: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

image

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై ఏలూరు జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.

Similar News

News November 10, 2025

మన్యం: అవిగో గజరాజులు.. గుండెల్లో గుబులు

image

మన్యం జిల్లాను ఏనుగుల గుంపు వదలడం లేదు. పాలకొండ నియోజకవర్గం నుంచి.. పార్వతీపురం వరకు సంచరిస్తూ మన్యం వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారే తప్ప వాటి తరలింపునకు చర్యలు చేపట్టడం లేదని.. కుంకీ ఏనుగులు తెచ్చి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు. సోమవారం కొమరాడ (M) వన్నం, మాదలంగి పరిసర గ్రామాల్లో ఏనుగుల గుంపు సంచరించింది.

News November 10, 2025

MSMEలకు ఆధునిక సౌకర్యాలు

image

AP: రాష్ట్రంలోని MSMEలకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే తరహా పరిశ్రమలున్న క్లస్టర్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల(CFC)ను ఏర్పాటుచేయనుంది. ఒక్కోదానికి ₹10కోట్లు వెచ్చించనుంది. ఇందులో కొత్త డిజైన్లు, రీసెర్చ్, టెక్నాలజీ, నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ తదితర సదుపాయాలు ఉంటాయి. వీటివల్ల MSMEలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం లభిస్తుంది.

News November 10, 2025

ప్రజ్ఞ యాప్ తో మహిళలు కుస్తీ

image

మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు కొత్త టాస్క్ నిర్వహిస్తుంది. వివిధ రకాల శిక్షణ, ప్రస్తుత కాలంలో ఉపయోగపడే యాప్స్, గూగుల్ డ్రైవ్ తదితర అంశాలపై ప్రజ్ఞ యాప్ డౌన్ లోడ్ చేసుకుని వీడియోలు విని చివరిలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంఘ మిత్రాలు మాత్రం మొత్తం ఒకేసారి విని సమాధానాలు పెట్టాలంటూ సభ్యులను ఆందోళనలకు గురి చేస్తున్నారు. 10 వీడియోలు ఓకేసారి వినలేక ఇబ్బందులు పడుతున్నారు.