News January 21, 2025
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి మృతి

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్ మృతి చెందాడు. హైదరాబాద్ లో విక్రమ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు చిల్లబోయినపల్లి ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా వెలిమినేడు వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.
Similar News
News November 7, 2025
నరసాపురం వరకు పొడిగించిన వందే భారత్ రైలు

కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు అందాయి. దీంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2025
మత్తు పదార్థాల నివారణపై గట్టి నిఘా ఉంచాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఇన్‌ఛార్జ్ జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధికారి ఆర్.వి. ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం ఉండరాదని, దీనిపై క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
News November 6, 2025
భీమవరం: మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

భీమవరం గునుపూడి పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 936 విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలో విద్యార్థులంతా వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు.


