News March 10, 2025
ఏలూరు: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్?

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన వంశీ(25) విజయవాడలోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఓ యువతి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి గిరిపురంలో రూము తీసుకుని ఉంటున్నారు. ఇటీవల ఆ యువతి రూము నుంచి వెళ్లిపోయింది. బాధతో వంశీ ఈనెల 6వ తేదీ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు.
Similar News
News October 26, 2025
పార్వతీపురం: రేపు వర్షాల కారణంగా గ్రీవెన్స్ రద్దు

పార్వతీపురం జిల్లా కేంద్రంలో సోమవారం జరగబోయే ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (గ్రీవెన్స్) రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేశామని, ప్రజలు గమనించి సమస్యలు తెలపడం కోసం పార్వతీపురం రావద్దని పేర్కున్నారు.
News October 26, 2025
తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
News October 26, 2025
రేపు PGRS రద్దు: కలెక్టర్

సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. మొంథా తుపాన్ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రజా రక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. తుపాను పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


