News August 14, 2025
ఏలూరు: విద్యుత్ దీపాలతో కలెక్టరేట్

ఏలూరు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని అవగాహన కల్పిస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్‌ను త్రివర్ణ రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.
Similar News
News August 15, 2025
గోదావరి నదిని పరిశీలించిన కలెక్టర్

ఇబ్రహీంపట్నం మం. ఎర్దండి గ్రామ శివారులోని గోదావరి నదిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. గతేడాది గోదావరి నది వరదతో ఉప్పొంగినప్పుడు తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీవర్షాల నేపథ్యంలో నదిలో వరద ఉప్పొంగితే తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి RDO శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 15, 2025
మంత్రి పొంగులేటితో ఇన్‌ఛార్జి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాలు సహాయక చర్యల నిర్వహణపై మంత్రి పొంగులేటి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ (రెవెన్యూ) తో పాటు టొప్పో పాల్గొన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి టొప్పో వివరించారు.
News August 15, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తీరంగా ర్యాలీలు
> రేపు జనగామకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
> స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
> కలెక్టర్ ను కలిసిన శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత
> జఫర్గడ్ పాక్స్ & డీసీసీబీ పాలకవర్గాల గడువు పొడగింపు
> పులివెందులలో జడ్పీటీసీ అభ్యర్థి గెలుపు పాలకుర్తిలో సంబరాలు
> రఘునాథపల్లిలో పర్యటించిన కలెక్టర్