News February 10, 2026

ఏలూరు: వివాహిత అనుమానాస్పద మృతి

image

మండవల్లి మండలంలోని నాగభూషణపురంలో వివాహిత మేఘన మంగళవారం అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతిచెందారు. ఛాతీనొప్పి రావడంతో కైకలూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామచంద్రరావు తెలిపారు.

Similar News

News February 21, 2026

GNT: సీఎం రాక.. భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ

image

గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఆదివారం తపాలాశాఖ ఆధ్వర్యంలో డాక్ సేవక్ సమ్మేళనం జరగనుంది. CM చంద్రబాబుతో పాటూ కేంద్రమంత్రి సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News February 21, 2026

PGRS ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి: GNT ఎస్పీ

image

గుంటూరు జిల్లా పో‌‌లీస్ కార్యాలయంలో శనివారం జనవరి నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పైసత్వరమే చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించితప్పించుకొనితిరుగుతున్న నేరస్థులను గుర్తించాలన్నారు.

News February 21, 2026

ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక చేయూత: కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

image

జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ తెలిపారు. శనివారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున మొత్తం రూ.2.25 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు 100 శాతం సబ్సిడీతో పునరావాస పథకం కింద అందజేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.