News March 27, 2025

ఏలూరు : వివిధ కారణాలతో ఆరుగురు మృతి

image

ఏలూరు జిల్లాలో బుధవారం వేరు వేరు కారణాలతో ఆరుగురు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్ సబార్టినేట్ పోలారావు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అదే మండలంలోని తేజస్విని మనస్తాపంలో ఉరివేసుకుని చనిపోయింది. ఏలూరులో ఒంటరితనం భరించలేక ఓ యువకుడు విషం తాగగా, పాము కాటుకు ఓ మహిళ చనిపోయింది. టి.నరసాపురంలో అప్పులు తీర్చలేక గుర్రం చెన్నారావు విషం తాగాడు. ముసునూరు వాసి నవీన్ అప్పులు తీర్చలేక చనిపోయాడు.

Similar News

News September 19, 2025

నక్సలైట్లూ మన అన్నదమ్ములే కదా: రేవంత్

image

TG: నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌‌పై CM రేవంత్ స్పందించారు. ‘నక్సలైట్లు లొంగిపోవడానికి గత ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశముంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించడంలో ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? నక్సలైట్ల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి’ అని వ్యాఖ్యానించారు.

News September 19, 2025

కుట్రలు చేసే వ్యక్తికి శ్రీకాళహస్తి గుడి ఛైర్మన్ పదవి ఇస్తారా: వినూత

image

శ్రీకాళహస్తి గుడి ఛైర్మన్‌గా కొట్టే సాయి నియామకాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్‌కు మాజీ ఇన్‌ఛార్జ్ కోట వినూత లేఖ రాశారు. ‘మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపై సాయి కుట్రలు చేశాడు. ఆ ఆధారాలను హరిప్రసాద్‌, నాదెళ్ల మనోహర్‌కు అందజేశా. జనసేనలో చాలామంది కష్టపడ్డారు. వాళ్లకు పదవి ఇవ్వండి. అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తా’ అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.

News September 19, 2025

NZB: టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: TPCC చీఫ్

image

టీచర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం NZBలో నిర్వహించిన టీచర్స్‌ డే సెలబ్రేషన్స్‌ బెస్ట్‌ టీచర్ అవార్డ్స్-2025 పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లడారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, హెల్త్‌ కార్డు అమలు, స్కిల్‌ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కళాశాలలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.