News December 18, 2025
ఏలూరు: వృద్ధురాలిపై దాడి.. బంగారు గొలుసు చోరీ

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎం. వెంకమ్మ (70)పై ఓదుండగుడు దాడి చేసి, మెడలో ఉన్న రెండున్నర కాసుల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. తిమ్మాపురం నుంచి ఆమె లక్కవరంలో కూతురు మహాలక్ష్మి ఇంటికి వచ్చింది. కూతురు, అల్లుడు బుధవారం పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగిందన్నారు. గాయపడిన వెంకమ్మను స్థానికులు లక్కవరం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 22, 2025
NZB: ప్రజలు భయాందోళనకు గురికావద్దు:కలెక్టర్

వరదలు, ఇతర విపత్తులు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా రేపు (సోమవారం) చేపడుతున్న మాక్ ఎక్సర్ సైజ్ కు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బోధన్ హంగర్గ గ్రామంతో పాటు NZBప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఖిల్లా రఘునాథ్ చెరువు వద్ద మాక్ ఎక్సర్ సైజ్ ఉంటుందన్నారు.
News December 22, 2025
HYD: డిసెంబరులోనూ డెంగ్యూ పంజా.. జర భద్రం !

సాధారణంగా వర్షాకాలంలో భయపెట్టే డెంగ్యూ ఈసారి చలికాలంలోనూ వణుకు పుట్టిస్తోంది. డిసెంబరు నెలలోనూ డెంగ్యూ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 10 రోజుల్లో నగరంలో నాలుగుకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క నవంబరులోనే సుమారు 90కి పైగా డెంగ్యూ, వైరల్ జ్వరాల కేసులు ఫీవర్ ఆసుపత్రికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు.
News December 22, 2025
భీమవరం: క్రీడోత్సవాల్లో సందడి చేసిన కలెక్టర్

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


