News January 20, 2026
ఏలూరు: వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ లిస్టు

ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరులోని కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో బోధ నేతర సిబ్బందికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్టును https:///www.deoeluru.org వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని ఏపీసీ పంకజ్ కుమార్ మంగళవారం తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 22లోగా రాతపూర్వకంగా సర్వ శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మవద్దని హెచ్చరించారు.
Similar News
News January 21, 2026
జనవరి 21: చరిత్రలో ఈరోజు

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం
News January 21, 2026
అర్హుల నుంచి టెండర్లకు ఆహ్వానం

హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన ప్రయోగశాల సామాగ్రి సరఫరా చేయుటకు దరఖాస్తుదారుల నుంచి టెండర్లను స్వీకరించనునట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా అర్హులైన దరఖాస్తుదారులు హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ సూచించారు.
News January 21, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


