News March 20, 2025

ఏలూరు: వైసీపీకి కార్పొరేటర్ రాజీనామా

image

ఏలూరు 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగోళ్ల శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపినట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన సోదరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మిని ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త అవమానించారని అన్నారు. ఆమెపై అసత్య ప్రచారాలు చేసి సస్పెండ్ చేయడం తనను ఎంతో బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News March 20, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్

image

కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో గురు, శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నాడు.

News March 20, 2025

నాటుసారా తయారీపై సమాచారం ఇవ్వండి: ఏలూరు కలెక్టర్

image

ఏపీని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా నాటుసారా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. గురువారం నాటుసారా నిర్మూలనకై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీపై టోల్ ఫ్రీ నంబర్ 14405 సమాచారం ఇవ్వాలన్నారు. సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ PS కిషోర్ తదితరులు ఉన్నారు.

News March 20, 2025

ఖమ్మం: పదో తరగతి పరీక్షలకు వేళాయే!

image

ఖమ్మం జిల్లాలో టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాల్లో 16,788 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. CC కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ శర్మ చెప్పారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 97 సిట్టింగ్ స్క్వాడ్స్, 97 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 98 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1595 మందిని ఇన్విజిలేటర్లుగా విధులు కేటాయించారు.

error: Content is protected !!