News March 27, 2024
ఏలూరు: వైసీపీలోకి గోపాల్ యాదవ్.. ప్రభావం చూపేనా..?

ఏలూరు పార్లమెంట్ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి సీటు ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైసీపీలో చేరారు. తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని తన వర్గీయులతో సమావేశాలు నిర్వహించి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం టీడీపీకి మైనస్ అవుతుందా..? వైసీపీకి కలిసివస్తుందా..? కామెంట్ చేయండి.
Similar News
News July 8, 2025
రాష్ట్ర స్థాయి అవార్డులు ఎంపికైన ప.గో జిల్లా అధికారులు

ఈనెల 9న రెడ్ క్రాస్ సేవలకుగాను పగో జిల్లా అధికారులకు గౌరవ గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకోనున్నారని జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ అధికారి వేంకటేశ్వరరావు, గ్రామీణ అభివృద్ధి శాఖ వేణుగోపాల్, మాజీ డీఈవో వెంకటరమణలు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయిలో అవార్డులను పొందడం జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు.
News July 8, 2025
తాడేపల్లిగూడెం: మద్యం తక్కువ పోశాడని హత్య

తాడేపల్లిగూడెం పాత రేలంగి చిత్ర మందిర్ సమీపంలో రెడ్డి గోవింద్ హత్య కేసులో నిందితుడైన గుబ్బల మల్లేశ్వరరావు (53)ను సోమవారం నరసింహారావుపేటలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ తెలిపారు. మద్యం తక్కువ పోశాడని ప్రశ్నించడంతో నిందితుడు మల్లేశ్వరరావు రాయితో గోవింద్ తలపై కొట్టి పారిపోయినట్లు విచారణలో తేలిందని సీఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
News July 8, 2025
మెగా పేరెంట్స్ మీట్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2,79,204 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 37,124 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని అన్నారు.