News March 15, 2025
ఏలూరు: శనివారం నుంచి ఒంటిపూట బడులు

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి మహాలక్ష్మమ్మ తెలిపారు. ఈ ఆదేశాలను డివైఈవోలు, ఎంఈవోలు అన్ని పాఠశాలల్లో పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.
Similar News
News March 15, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.
News March 15, 2025
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ వంటి అనేక దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి ఆమోదం రాలేదని, జాబితాలో స్వల్ప మార్పులు ఉండొచ్చని శ్వేతసౌధ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.
News March 15, 2025
పాక్‌కు బిగ్ షాక్: 214 సైనికుల్ని చంపేసిన BLA

పాకిస్థాన్‌కు చావుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ‘యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48hrs గడువిచ్చాం. వారి జవాన్లను రక్షించుకొనేందుకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితుల్ని పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం. మా 12మంది అమర వీరులకు నివాళి అర్పిస్తున్నాం’ అని BLA ప్రకటించింది.