News March 20, 2025

ఏలూరు: సత్తా చాటిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ విద్యార్థులు

image

ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజి విద్యార్థులు 2024 సంవత్సరానికి జరిగిన యంబీబీయస్ పరీక్షా ఫలితాలలో అఖండ విజయాన్ని నమోదు చేశారు. 257 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పరీక్షలలో 238 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆశ్రం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ యం.బి.బి.యస్ పార్ట్-1 లో 100% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పార్ట్-2లో 92% శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు.

Similar News

News October 28, 2025

‘మొంథా’ తుఫాను సమాచారం.. ఎప్పటికప్పుడు!

image

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.

News October 28, 2025

ఫేక్ ప్రచారాలు చేసే వారిపై చర్యలు: సీపీ

image

విజయవాడలోని బుడమేరు పొంగుతుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడానికి కొంతమంది ఫేక్ సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు. ప్రజలు ఎవరూ కూడా అపోహలను నమ్మొద్దని చెప్పారు. తుపానుపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫేక్ ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News October 28, 2025

విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా?

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జర్మనీలో మెకానిక్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/