News November 28, 2025

ఏలూరు: సివిల్స్ మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పొడిగింపు

image

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్ మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు డిసెంబర్ 7వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి గురువారం తెలిపారు. డిసెంబర్ 7న రాజమండ్రిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 14వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నం. 9030211920 సంప్రదించాలన్నారు.

Similar News

News December 1, 2025

25,487 ఉద్యోగాలు.. అర్హతలివే

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 25,487 కానిస్టేబుల్(GD) ఉద్యోగాలకు <<18442408>>నోటిఫికేషన్<<>> విడుదలైంది. అర్హతలు: 01-01-2026 నాటికి 18-23ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), టెన్త్ ఉత్తీర్ణత సాధించాలి. అప్లికేషన్ ఫీజు రూ.100. NCC ‘A’ సర్టిఫికెట్ ఉంటే 2%, NCC ‘B’కి 3%, NCC ‘C’కి 5% మార్కులను జత చేస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్, PET, PST ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://ssc.gov.in

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో రేపు యథావిధిగా స్కూల్స్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం యథావిధిగా స్కూల్స్ కొనసాగనున్నాయి. ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో సోమవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 2న మోస్తరు వర్షాలు కురవనుండడంతో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించాలని DEO ఆదేశాలు జారీ చేశారు.

News December 1, 2025

పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

image

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.