News February 28, 2026
ఏలూరు: ‘సెకండ్ ఇంటర్ పరీక్షకు 5,791 మంది హాజరు’

ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సెంకడ్ ఇయర్బో టనీ పరీక్షకు మొత్తం 6,828 మంది విద్యార్థులకు గానూ 5,791 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. 55 సెంటర్లో జరిగిన ఈ పరీక్షలకు వివిధ కారణాల చేత 237 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 3,916 మంది, ఒకేషనల్ విభాగంలో 1,875 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన వివరించారు.
Similar News
News March 2, 2026
TGలో BJP మోడల్ ‘బుల్డోజర్ రాజ్’: కేరళ CM

తెలంగాణలోని INC ప్రభుత్వం BJP మోడల్ బుల్డోజర్ రాజ్‌ను నడిపిస్తోందని కేరళ CM పినరయి విజయన్ విమర్శించారు. ఖమ్మంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న దాదాపు 700ఇళ్లను GOVT కూల్చివేయడంపై ఆయన Xలో ఫైరయ్యారు. ‘3వేల మంది పేదలను నిరాశ్రయుల్ని చేసి INC తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పేదలను పీడించే బీజేపీ విధానాలను అనుసరిస్తోంది. పేదలపై చేస్తున్న ఈ దాడికి ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
News March 2, 2026
VZM: రబీ సీజన్‌కు యూరియా కొరత లేదు

రబీ సీజన్ 2025-26కు జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అవసరమైన యూరియాలో ఎక్కువ భాగం సరఫరా కాగా, 5,398 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులు మట్టి పరీక్ష ఆధారంగా సమతుల ఎరువులు వినియోగించాలని సూచించారు.
News March 2, 2026
సంగారెడ్డి: ప్రజావాణికి 56 ఫిర్యాదులు

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 56 మంది తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.


