News September 14, 2025
ఏలూరు: సెప్టెంబర్ 16న కలెక్టరేట్‌లో జాబ్ మేళా

ఏలూరు జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి సెప్టెంబర్ 16న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కాంపౌండ్‌లో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు శనివారం తెలిపారు. NCS నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లమో ఉత్తీర్ణత పొందిన 18-26 సంవత్సరాల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
HYD: ట్రాఫిక్ సమస్యలు.. మెట్రో ఎక్కిన బీజేపీ చీఫ్

దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ HYDలో రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో తాను మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు.
News September 14, 2025
JGTL: ‘శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు’

శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్ బండి తరాల శ్రీకాంత్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దాదాపు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో శ్రీకాంత్‌పై పీడి యాక్ట్ అమలు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ కరుణాకర్ శనివారం నిందితుడికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులను అందజేశారు.
News September 14, 2025
HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.