News March 27, 2025
ఏలూరు: సోషల్ పరీక్ష పై క్లారిటీ ఇచ్చిన డీఈవో

ఏలూరు జిల్లాలో నిర్వహించవలసిన సాంఘిక శాస్త్రం 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పై పలు అపోహలు విడాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ గురువారం అన్నారు. డీఈవో మాట్లాడుతూ.. రంజాన్ సెలవు మార్చి 31న ప్రభుత్వం ప్రకటిస్తే.. ఏప్రిల్ ఒకటిన షోషల్ పరీక్ష ఉంటుందన్నారు. ఒకవేళ ఏప్రిల్ 1న రంజాన్ సెలవు ప్రకటిస్తే.. మార్చి 31న సోషల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.
Similar News
News January 8, 2026
జగిత్యాల: ‘జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు’

దేశంలో న్యాయం కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు, న్యాయవాదులకు తగిన రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హైకోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. గురువారం జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు దేశానికి నాలుగో స్తంభమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులు, న్యాయవాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఇద్దరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
News January 8, 2026
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా

ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్లో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈరోజు సాయంత్రం పిఠాపురం చేరుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన వాయిదా పడింది. రేపు ఉదయం ఆయన మంగళగిరి నుంచి రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం వస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. పర్యటన వాయిదా పడటంతో అధికారులు రేపటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 8, 2026
ఇందిరమ్మ ఇండ్లకు రుణ సదుపాయం కల్పించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పరిస్థితులు లేని లబ్ధిదారులకు రూ.లక్ష సహాయం అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల ఖర్చులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిధుల సమస్య ఏమీలేదని, బిల్లులు అప్లోడ్ చేస్తే మంజూరవుతాయన్నారు.


