News February 28, 2025
ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.
Similar News
News March 1, 2025
ప్రభాకర్ సేవలను కొనియాడిన చిత్తూరు కలెక్టర్

జిల్లా పశుసంవర్ధకశాఖలో ఎన్నో సంవత్సరాల పాటు పనిచేస్తూ మూగజీవాలు, రైతులకు డాక్టర్ ప్రభాకర్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశంసించారు. జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో మిట్టూరులోని ఎన్పీసీ పెవిలియన్‌లో జరిగిన ప్రభాకర్ పదవీ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రభాకర్ సేవలను కొనియాడారు.
News March 1, 2025
టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కర్నూలు కలెక్టర్

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
News March 1, 2025
ముగిసిన కపిలతీర్థం బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరిగింది. హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు.