News December 19, 2025
ఏలూరు: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

వ్యక్తిని రాడ్‌తో కొట్టి చంపిన ఘటనలో ఇద్దరికి జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. ఏలూరు తూర్పు వీధికి చెందిన తిరుమల రామ శివ, కలవల నాగరాజులు 2018 మే 17 తేదీ రాత్రి వైన్ షాపు వద్ద యాదాద్రి శ్రీ హర్షతో గొడవపడి అతనిపై రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. వాదోపవాదములు విన్న తర్వాత జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి శుక్రవారం మధ్యాహ్నం వీరికి జీవిత ఖైదు విధించారు.
Similar News
News December 20, 2025
నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

నెల్లూరు జిల్లాలో హైరిస్క్ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.
News December 20, 2025
చిత్తూరు: ‘బాలికను గర్భిణీని చేశాడు’

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని పోక్సో కేసులో అరెస్ట్ చేసినట్టు నగిరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ తెలిపారు. వెదురుకుప్పం మండలంలోని 14 ఏళ్ల బాలికపై మురళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో గర్భం అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
News December 20, 2025
నల్గొండ: త్వరలో సహకార ఎన్నికలు..!

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 110 పీఏసీఎస్‌లు ఉండగా సూర్యాపేట జిల్లాలో 47, నల్గొండలో 42, యాదాద్రిలో 21 ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఈసారి పొడిగించకుండా ఎన్నికలు నిర్వహించనుంది.


