News January 17, 2025

ఏలూరు: హీటర్ ఆన్ చేసి మరిచిపోయి వ్యక్తి సజీవదహనం

image

హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్‌తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.

Similar News

News December 20, 2025

వీరవాసరం: ప్రజల ముంగిటకే ‘వాట్సాప్‌’ గవర్నెన్స్

image

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’ ప్రచారంలో జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. శుక్రవారం వీరవాసరం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని కొత్తపేట సచివాలయం-2 పరిధిలో అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సమయం వృథా కాకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అన్నారు.

News December 19, 2025

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే విజయవంతం చేయాలి: జేసీ

image

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే 2025’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ రాహుల్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌గా వీక్షించారు. ఈ నెల 25 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల ద్వారా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు పెద్దపీట వేయనున్నట్లు జేసీ తెలిపారు.