News February 25, 2026
ఏలూరు: హెచ్చరిక.. నమ్మి మోసపోవద్దు

ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. హెచ్చరికలు విస్మరించి దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Similar News
News February 26, 2026
అసైన్డ్ భూములు లీజుకు.. ఎకరాకు ₹31 వేలు: అనగాని

AP: అసైన్డ్ భూముల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్నిచోట్ల అసైన్డ్ భూములు అవసరం. అసైన్‌దారుల అనుమతితో లీజుకు తీసుకుంటాం. లీజుతో వారికి ఆదాయం వస్తుంది. ఎకరాకు ₹31వేలు చొప్పున ఇస్తాం. రెండేళ్లకోసారి 5% వరకు పెంచుతాం’ అని చెప్పారు. 10వేల MW సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని, 7.5L మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.
News February 26, 2026
సిరిసిల్ల : 68 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటిరోజు 3814 మంది విద్యార్థులకు గాను 3746 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. 68 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
News February 26, 2026
మార్చి 1న అమరావతిలో పర్యటించనున్న CJI జస్టిస్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్చి 1న అమరావతిలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు CJI అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. AP జ్యుడిషియల్ అకాడమీ భవనం, AP హైకోర్టు అతిథి గృహాల శంకుస్థాపన, న్యాయమూర్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో CJI పాల్గొననున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది.


