News October 14, 2025

ఏలూరు: హేలాపురి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగినప్పుడే సదరు కార్యక్రమం ఉద్దేశం నెరవేరుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు గిరిజన భవన్‌లో సోమవారం హేలాపురి ఉత్సవాలు, గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్స్‌ను జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. సూపర్ జీఎస్టీ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు.

Similar News

News October 14, 2025

BREAKING: లొంగిపోయిన మల్లోజుల

image

మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు 60 మంది సభ్యులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్దికాలంగా ఈయన మావోయిస్టుల ప్రస్తుత పంథాకు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేస్తుండటం తెలిసిందే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన 30 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నారు. ఈయనపై 100కు పైగా కేసులున్నాయి. రూ.1కోటి రివార్డు ఉంది.

News October 14, 2025

కర్నూలుకు మోదీ.. పాఠశాలలకు సెలవు

image

ప్రధాని నరేంద్ర <<18001308>>మోదీ<<>> ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనుండటంతో 15, 16 తేదీల్లో నాలుగు మండలాల పరిధిలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. కర్నూల్ అర్బన్, రూరల్, కల్లూరు, ఓర్వకల్ మండలాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. FA-2 పరీక్షలు 21, 22వ తేదీలలో నిర్వహించాలని ఆదేశించారు.

News October 14, 2025

వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కి మంగళవారం మిర్చి బస్తాలు తరలివచ్చాయి. కాగా సోమవారంతో పోలిస్తే తేజ మిర్చి ధర పెరగగా మిగతా మిర్చి ధరలు తగ్గాయి. 341 రకం మిర్చి క్వింటాకు సోమవారం రూ.16,300 ధర పలకగా..ఈరోజు రూ.16,150 అయింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.16వేలు ధర వస్తే.. నేడు రూ.15,500 ధర వచ్చింది. తేజ మిర్చికి సోమవారం ధర రూ.14,300 ధర పలకగా.. మంగళవారం రూ.14, 550 కి పెరిగింది.