News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఏలూరు హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

Similar News

News July 6, 2025

సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

image

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

News July 6, 2025

KMR: UPSC సివిల్స్‌కు ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సివిల్స్‌కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని స్రవంతి తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08462-241055కు సంప్రదించాలని ఆమె కోరారు.

News July 6, 2025

ములుగు జిల్లాలో 36.00 మి.మీ వర్షపాతం

image

ములుగు జిల్లాలో ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ 12.2, ములుగు 4.4, గోవిందరావుపేట 9.8, తాడ్వాయి 2.6, వాజేడు 1.6, వెంకటాపురం 1.2, మంగపేటలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 4.2గా ఉంది.