News March 5, 2025
ఏలూరు: 1000 ఓట్లు కూడా దాటని ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో చాలా మందికి మూడంకెల స్కోరు కూడా దాటలేదు. మరికొందరికైతే 100 లోపు ఓట్లే పడ్డాయి. వేణుగోపాలకృష్ణకు 1017 ఓట్లు, హేమ కుమారికి 956, వానపల్లి శివ గణేష్ 772, అసన్ షరీఫ్ 759, బండారు రామ్మోహన్ 709, చిక్కాల దుర్గాప్రసాద్ 665, కాట్రు నాగబాబు 565 ఇలా చాలా మంది అభ్యర్థులు 1000 మార్క్ కూడా టచ్ చేయలేకపోయారు.
Similar News
News March 6, 2025
రాజమండ్రి: రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ సమావేశం

రాజమండ్రి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నేడు రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ కేతన్ గర్గ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి గాను నగర ప్రజలు ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీల బకాయిలను వచ్చే వారంలోపు 100% వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News March 5, 2025
గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు ఆపాలని ధర్నా

గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కే మస్తాన్ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికులతో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతికి వినతి పత్రం అందచేశారు.
News March 5, 2025
తూ.గో: ఈనెల 11న బహిరంగా వేలం

వివిధ 6A కేసులలో సీజ్ చేసిన 47.274 టన్నుల PDS బియ్యాన్ని ఈనెల 11వ తేదీన గోపాలపురంలోని MLS పాయింట్ వద్ద బహిరంగా వేలం వేయటం జరుగుతుందని తూ.గో JC చిన్నరాముడు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు ముందుగా రూ.2 లక్షల ధరావత్తును జేసీ పేరునా డీడీ రూపంలో చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. కేజీ బియ్యానికి ప్రభుత్వం పాట రూ.30 అని చెప్పారు.